ఈ నెల 31 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న బామ్ సేఫ్, రాష్ట్రీయ మూల్ నివాసి సంఘ్ 12వ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ నలుమూలల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తరలి రావాలిని బివియం రాష్ట్ర కన్వీనర్ భూంపల్లి రవితేజ కోరారు.బిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో బాంసెఫ్ మహసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు రవితేజ, విఠల్, ప్రభాకర్ మాట్లాడుతూ ఈ దేశంలోని అనేక సమస్యల మీద పోరాడుతున్నటువంటి సంఘం బామ్ సేఫ్ అన్నారు.ఓబీసీ కుల జనగణన జరపాలని , ఈవీఎం మిషన్లను తొలగించాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఇలా అనేక సమస్యల పైన నిరంతరం పోరాటలని చేయాలని అన్నారు.