వెంకటాపురం, మంగపేట, వాజేడు మండలాల్లో నడుస్తున్న ఇసుక క్వారీల కారణంగా వాహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి సాంబశివ అన్నారు. శనివారం సాయంత్రం ఏటూరునాగారం ASP శివం ఉపాధ్యాయకు వినతి పత్రం అందజేశారు. సాంబశివ మాట్లాడుతూ.. క్వారీలకు వచ్చే లారీలతో రోడ్లు ధ్వంసం అవడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా ఆసుపత్రికి వెళ్లలేని దుస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.