శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేట సర్పంచ్ జీరు బాబురావు సోదరుడిపై నౌపడ ఎస్సై భౌతిక దాడి చేశారని గురువారం మీడియాతో వాపోయారు. వివరాల్లోకి వెళితే.. మూలపేట గ్రామం ప్రజా సమస్యలపై జరిగిన వివాదంలో తనపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. అనంతరం రొయ్యల చెరువు వద్ద ఉన్న సోదరుడిపై ఎస్సై నారాయణరావు దాడికి పాల్పడ్డారని, గాయపడ్డ తన సోదరుడిని స్థానికులు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్పించారన్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఆసుపత్రికి చేరుకున్న వైసీపీ ఇన్చార్జి పేరాడ తిలక్ పరిస్థితిని సమీక్షించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు...