వెల్దుర్తికి చెందిన మహేష్ అనే యువకుడు అంతర్జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించి, తనతల్లిదండ్రులకు గెలుపును బహుమతిగా గురువారం అందించాడు.నిరుపేద కుటుంబంలో పుట్టి, పదో తరగతిలో 500 మార్కులుసాధించిన మహేష్, ఇంటర్ ఎంపీసీ చదువుతున్నప్పుడుఏబీ మార్షల్ ఆర్ట్స్ అకాడమిలో శిక్షణ పొందాడు. ప్రస్తుతండిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న మహేష్, రోజూ నాలుగుగంటల పాటు శిక్షణ తీసుకుంటూ బాక్సింగ్ నైపుణ్యంసాధించాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, కోచ్ ఫయాజ్మార్గదర్శకత్వంలో మహేష్ ఈ విజయం సాధించి, తన ఊరికిపేరు తెచ్చాడు.