వెదురుకుప్పం పోలీసు స్టేషన్ వద్ద గ్రామస్థుల ధర్నా వెదురుకుప్పం మండలం సీఆర్ కండ్రిగ నూతన వినాయక స్వామి ఆలయం వద్ద డీజే, రికార్డింగ్ డాన్సులు నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు గురువారం రాత్రి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసులు డౌన్ డౌన్ అంటూ ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.