జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ఉదయం ఈ సంవత్సరం పండిన కొత్త సందర్భంగా మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న కొబ్బరికాయలు కొట్టి కొనుగోలను ప్రారంభించారు. ఇళ్లందకుంట గ్రామానికి చెందిన దంసాని స్వామి రెండు బస్తాల కాటన్ తీసుకురాగా క్వింటాల్ కు ధర 5,021 రూపాయలు పలికింది. ఈ సందర్భంగా మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతులు కొత్తగా పండించిన పత్తి పంటను నేరుగా మార్కెట్ కు తీసుకువచ్చి మంచి ధరను పొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లతో పాటు ఖరీదుదారులు ఆర్తిదారులు పాల్గొన్నారు