నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల సింగిల్ విండో అధ్యక్షుడిగా అంబటి వివేకానంద రెడ్డికి అవకాశం కల్పించి, అంబటి కుటుంబానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సముచిత స్థానం కల్పించాలని టీడీపీ మండల అధ్యక్షుడు మూల రామేశ్వర రెడ్డి అన్నారు. శుక్రవారం కొలిమిగుండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్గా అంబటి వివేకానంద రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రముఖ నేతలు వీఆర్ లక్ష్మీరెడ్డి, పులి ప్రకాష్ రెడ్డి, హుస్సేన్ రెడ్డి పాల్గొన్నారు.