కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని యోగి వేమన విశ్వ విద్యాలయం అభివృద్ధి జరగాలంటే అరకొరగా 10 కోట్ల రూపాయలు రాష్ట్ర ఉన్నత విద్య శాఖ మంత్రి నారా లోకేష్ కేటాయించడం దారుణం అని బుధవారం ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబులేసు యాదవ్ తెలిపారు.కడప ఆర్ఎస్ఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ నిధులు వర్సిటీ అభివృద్ధికి ఏమాత్రం సరిపోవని తక్షణమే మధ్యలోనే ఆగిపోయిన వైవియు అభివృద్ధి జరగాలంటే 100 కోట్ల రూ.నిధులు కేటాయించాలన్నారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వర్సిటీ అభివృద్ధి పనుల పేరుతో కంటితుడుపుగా 10 కోట్లు కేటాయించారన్నారు.