నంద్యాలలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఆదివారం వైభవంగా ప్రారంభించారు. నంద్యాల చెరువు కట్ట దగ్గర మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తదితరులు పాల్గొని వినాయకుడికి పూజలు చేసి, నిమజ్జనం చేశారు. వినాయకుడికి 5 రోజుల పాటు భక్తులు విశేష పూజలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.