కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కాశినాయన మండలం నరసాపురం గ్రామంలో 108 సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వ్యక్తి తను చాలించడం బాధాకరమని గురువారం పీసీసీ సభ్యులు అన్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం తెల్లవారుజామున బారాగజ్ మహబూబ్ బాషా కుమారుడు మహబూబ్ పీరా (27 సం) అనే యువకుడు 108 సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తనువు చాలించడం చాలా బాధాకరమని, ఇది పూర్తిగా 108 సిబ్బంది మరియు ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని పీసీసీ సభ్యులు అన్వర్ ఆరోపించారు. మృతుని ఇంటికి వెళ్లి మృతుని తల్లిదండ్రులను పరామర్శించారు.