రుషికొండలో రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ ను.. అన్ని జిల్లాల్లో ప్యాలెస్ నమూనా పార్టీ కార్యాలయాలను ఆగమేఘాల మీద నిర్మించిన జగన్మోహన్ రెడ్డి ప్రజోపయోగమైన మెడికల్ కాలేజీ నిర్మాణాలను మాత్రం మర్చిపోయారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఎం.వి.పి.కాలనీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయిదేళ్లలో కేవలం అయిదు మెడికల్ కాలేజీలను అప్ గ్రేడ్ చేశారని, మిగిలిన వాటిలో 20 శాతం పనులు కూడా చేయలేదని విమర్శించారు. ప్యాలెస్ నిర్మాణాలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యానికి సంబందించిన మెడికల్ కాలేజీపై లేకపోవడాన్ని తప్పు పట్టారు.