అర్హులైన వికలాంగులకు కూడా పెన్షన్లు తొలగించడం దౌర్భాగ్యం అని రాష్ట్ర వైసీపీ వైద్య విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ అశోక్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని తన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతూ పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి పెన్షన్ తొలగించడం పై ఆందోళన వ్యక్తం చేశారు సుబ్బారెడ్డి కి కాలు పూర్తిగా విరిగి మంచాన పడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తికి పెన్షన్ తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.