పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం ధూళిపాళ్లలో వ్యవసాయ మార్కెట్ యార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే కన్నా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా నియమితులైన ప్రతినిధులు రైతులకు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.