ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ లోని డీపీఆర్ఓ కార్యాలయంలో బుధవారం మీడియా సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పత్రికల్లో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటిస్తూ యాడ్స్ పెయిడ్ ఆర్టికల్స్ ప్రచురించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, శ్యామలాదేవి, డి.పి.ఆర్.ఓ తిరుమల, పలువురు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు