తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లోని డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ కుమారి మాట్లాడారు. డిగ్రీ విద్యార్థులకు ఆత్మహత్య నివారణపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. జీవన విలువలు, ఆశతో ముందుకు సాగడం, సానుకూల ఆలోచన లను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో తెలియజేశామన్నారు. జీవితం అమూల్యం, కష్టాలు తాత్కాలికమని, మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యం లాగా గౌరవించాలని చెప్పారు. ప్రతి ఒక్కరి ప్రాణం విలువైన దాని గ్రహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు