ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో ఆర్టిసి బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. క్షతగాత్రుడు మండలంలోని తూర్పునాయుడుపాలెం కు చెందిన శ్రీహరి బాబుగా పోలీసులు గుర్తించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని గాయపడ్డ వ్యక్తి కుటుంబ సభ్యులకు ప్రమాదంపై సమాచారాన్ని చేరవేసినట్లు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు.