సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని ఆందోల్ మండలం సంగుపేట శివారులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక బజారును సంగారెడ్డి జిల్లా హౌసింగ్ పీడీ తిలపతిరావు గురువారం నాడు ఆకస్మికంగా అతనికి చేశారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇసుక బజార్ ద్వారా ఇసుకను బుకింగ్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పిడి మాట్లాడుతూ ఇసుక దళారుల వద్ద తన్నుకు 2900 ఉందని ప్రభుత్వం తనుకు 1200 ధర నిర్ణయించిందన్నారు లబ్ధిదారులు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలనుసారం ఆందోల్ నియోజకవర్గంలో మొట్టమొదటి ఇసుక బజారును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.