హైదరాబాద్ నగరవ్యాప్తంగా వినాయక నిమజ్జనాల శోభ సంతరించుకుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు గణపయ్య నామస్మరణతో దద్దరిల్లుతున్నాయి. వీటికి సంబంధించి నగరంలో సీసీ కెమెరాల ఫుటేజ్ ని పోలీసులు శనివారం ఉదయం పరిశీలించారు. నగరంలో ఎక్కడ వాహనాలు బ్రేక్ డౌన్ అయిన వాటిని పరిశీలిస్తూ పక్కకు తరలిస్తున్నారు. నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పరిశీలిస్తున్నారు.