గోకవరం మండలం కృష్ణుని పాలెం లో పెట్రోల్ బంకు వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా మంగళవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. ఈ ఘర్షణలో గోకవరానికి చెందిన శివ, అచ్చారావు, కామేష్, మహిపాల దుర్గాప్రసాద్ అనువారు ఓసి బంధ గ్రామానికి చెందిన జ్యోతి, భరత్ పై కోడి కత్తులతో దాడి చేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుల కోసం గాలించి నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.