lబాల్య వివాహాలపై శనివారం నంద్యాల శక్తి టీం హెడ్ కానిస్టేబుళ్లు ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ, మహిళా పోలీస్ స్నేహలత అవగాహన కల్పించారు. నంద్యాల మండలం పెద్దకొట్టాలలోని శ్రీవాణి పాఠశాలలోని విద్యార్థినులకు ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు శక్తియాప్, 100, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ప్రతి మహిళా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందాలన్నారు.