ఫోర్జరీ, దౌర్జన్యం, చీటింగ్ కేసులలో ప్రజలు నిర్భయంగా పోలీసు వ్యవస్థని సంప్రదించవచ్చనీ ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి అన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ, పేద ప్రజల భూములను కబ్జా చేయాలనుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. మంగళవారం సమావేశంలో డిఎస్పి మాట్లాడుతూ...మావల పోలీస్ స్టేషన్ పరిధిలో దళితుల భూమీ కబ్జా కు ప్రయత్నం చేసి, బెదిరించిన కేసులో బీజేపీ మాజీ కౌన్సిలర్, నిందితుడు ఉష్కం రాఘుపతి ని అరెస్టు చేసినట్లు తెలిపారు. తదుపరి న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యూడిషల్ రిమాండ్ కు తరలించడం జరిగింది అని తెలిపారు.