గద్వాల జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. జిల్లాలో 38.4 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా అయిజ మండలంలో 54.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో మండలంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల నుంచి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచాయి. తక్కువగా మానవపాడు మండలంలో 18.0 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది..