రీల్స్ పిచ్చితో జలపాతం వద్ద వెళ్లి అడవిలో తప్పిపోయిన యువకుడు. ములుగు జిల్లాలోని వాజేడు మండలం ముత్యంధార జలపాతాన్ని చూడడానికి వెళ్లి యువకుడు తప్పిపోయిన ఘటన నిన్న సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ కు చెందిన అబ్రార్ అనే యువకుడు నిన్న సోమవారం సాయంత్రం జలపాతం చూసేందుకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో చీకటి పడటంతో దారి తప్పిపోయాడు. దీంతో డయల్ 100కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అటవీ అధికారులు గాలించి, నేడు మంగళవారం రోజున తెల్లవారుజామున బయటకు తీసుకువచ్చి కేసు నమోదు చేశారు.