ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో శనివారం రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు పగటిపూట ఉష్ణోగ్రతలు కొంత మేరకు పెరిగాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం తర్వాత వాతావరణం లో మార్పులు చోటుచేసుకుని రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు లేకపోవడం వల్ల విద్యుత్ సరఫరాకు పట్టణంలో అంతరాయం ఏర్పడలేదు. అయితే ఎంత మొత్తంలో వర్షపాతం నమోదయిందో వాతావరణ శాఖ అధికారులు వెల్లడించవలసి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి.