ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారితనంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. స్థానిక టి.టి.డి.సి. మీటింగ్ హాల్ లో మధిర నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో చేపట్టనున్న పైలెట్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహణపై అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి పాల్గొన్నారు.