కొత్త వెల్లంటికీ చెందిన వైసీపీ నేత జనార్దన్ రెడ్డీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డీ, అయన తమ్ముడు గిరిధర్ రెడ్డీ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా జనార్దన్ రెడ్డికి, అయన అనుచరులకు కండువా కప్పి వారు ఆహ్వానం పలికారు. రూరల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషి చెయ్యాలని కోటంరెడ్డి అన్నారు. పార్టీలో చేరిన అందరికి ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.