నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో జరిగిన సీయం కప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పథకాలు సాధించిన క్రీడాకారులను అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు సన్మానించారు. డివైఎస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మేజర్ ధ్యాన్‌చంద్ భారత క్రీడాలకు చేసిన సేవలు అమోఘమని, ఆయన స్ఫూర్తితో ప్రతి క్రీడాకారుడు కృషి చేస్తే అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించడం సాధ్యమని అన్