ప్రస్తుతం వర్షాకాల సీజన్లో రైతులకు ధాన్యం ఆరబోసుకునేందుకు టార్పల్లిన్ పట్టలు ఉపయోగకరంగా ఉంటాయని ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్ తెలిపారు. గురువారం బాచేపల్లిలో ఏర్పాటు చేసిన పట్టల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అహోబిలం శ్రీనివాస సేవా సంస్థ ఆధ్వర్యంలో బాచేపల్లి, బాచేపల్లితాండ, ఆర్. కృష్ణాపురం, అహోబిలం కొండంపల్లె గ్రామాలకు చెందిన 175 మంది రైతులకు టార్పాలిన్ పట్టలను పంపిణీ చేశామన్నారు.