వినాయక నిమజ్జనం సందర్భంగా కొన్ని ఆర్టీసీ బస్సులను కల్లూరు మీదుగా వెళ్లాలని అధికారులు ఆదేశించారు. గోడలు శిథిలమై ప్రమాదం పొంచి ఉన్న కల్లూరు ఒక్కెర వాగు బ్రిడ్జిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని శివారు కాలనీల పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఆవాజ్ నాయకులు ఎల్ నయుం విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు పలు సంఘాల ప్రతినిధులతో కలిసి పీపీఎస్ఎస్ ప్రతినిధి బృందం నగరంలోని ప్రధాన రోడ్లపై పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ బస్సులను కర్నూలు నగరంలోని కల్లూరు మీదుగా వెళ్లాలని అధికారులు తీసుకున్న నిర్ణయం పై పునర్ సమీక్షించాలన