విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు కింద పడి గాయాలపాలయ్యారు. కాగా ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఉండటంతో ప్రాణాపాయాల నుంచి బయటపడ్డారని ట్రాఫిక్ ఎస్ఐ బేగ్ తెలిపారు. స్వల్ప గాయాలపాలైన వారిని స్థానికులు వైద్య నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.