కొల్లి శారద హోల్ సెల్ కూరగాయల మార్కెట్ లోని 81 షాపులకు ఆక్షన్ లో పాల్గొని హెచ్చు పాట పాడి లీజుదక్కించుకున్న లీజు దారులకు షాపులను కేటాయించుటకు స్టాండింగ్ కమిటీ వారు ఆమోదం తెలిపుట జరిగిందని స్థాయిసంఘం అధ్యక్షులు మరియు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. గురువారం సాయంత్రం స్థాయి సంఘం అధ్యక్షుల వారి ఛాంబర్ (మేయర్ ఛాంబర్) లో నగర కమీషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నగర పాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు.