పెడనలో ఫుడ్ సేఫ్టీ అధికారి సిహెచ్. గోపాల్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హరిదాస్ హాస్పిటల్ పక్కన ఉన్న కేఎం బిర్యానీ పాయింట్, బంటుమిల్లి రోడ్డులోని ఎస్ ఆర్ కె బిర్యానీ పాయింట్లను పరిశీలించి అక్కడి ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయని నిర్వాహకులకు సూచించారు. ఈ తనిఖీలలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ హరి కిషోర్ పాల్గొన్నారు.