లంగర్ హౌస్ దర్గా సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దర్గా సమీపంలో పోలీస్ వాహనాన్ని వేగంగా వచ్చిన కారు ఢీకొన్నింది. ఈ ఘటనలో కారులోన యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కారులో మద్యం సీసాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.