సీ.బెలగల్ మండలంలోని కృష్ణదొడ్డి గ్రామానికి చెందిన కోదండరాముడు ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లోలో రెండు ఉద్యోగాలకు ఎంపికై ప్రతిభ చూపాడు. గ్రామానికి చెందిన గోపాల్, పుణ్యవతి దంపతుల కుమారుడు కోదండరాముడు 8 ఏళ్లపాటు ఆర్మీలో విధులు నిర్వర్తించాడు. 2018లో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. అనంతరం ఏపీ మెగా డీఎస్సిలో పోటీపడి స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు ఎంపికయ్యాడు.