బాల్య వివాహాల నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని బాపట్ల జిల్లా వైద్య శాఖ అధికారి విజయమ్మ చెప్పారు. బుధవారం జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో పీసీ అండ్ పీఎన్డీటీ సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలు, లింగ వివక్షత పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాటిని నిరోధించాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో ఎన్జీవోల సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.