Parvathipuram, Parvathipuram Manyam | Aug 25, 2025
రైతులకు సరిపడా యూరియా, పొటాష్ ఎరువులను ఇవ్వాలని, నానో యూరియా, పొటాష్, పురుగుల మందులను అంటకట్టవద్దని డిమాండ్ చేస్తూ ఈనెల 28న పార్వతీపురం లోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతుందని రైతు సంఘం పాచిపెంట మండల అధ్యక్షుడు మాదిరెడ్డి తిరుపతినాయుడు తెలిపారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంటలో సంఘం కార్యదర్శి బోను గౌర్నాయుడుతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఎరువులను ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద నాసిరకమైన ఎరువులను అధిక ధరకు కొనుగోలు చేసి నష్టపోతున్నారన్నారు.