శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ కి మున్సిపాలిటీ డ్రైనేజీ వరదనీరు చేరింది. ఇటీవల కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో పరిస్థితి యథాతథంగా ఉంది. మంగళవారం కురిసిన భారీ వర్షంతో మురికి నీటిలో ప్రయాణికులు నడవాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ఇసుక బస్తాలు వేసి అడ్డుకట్ట ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.