నిర్మల్ జిల్లా పింఛన్ దారులు పడుతున్న బాధలు సీఎం రేవంత్ రెడ్డికి పట్టడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. భైంసాలో పింఛన్ దారుల మహాగర్జన సదస్సులో పాల్గొని మాట్లాడారు. గుడిసెలల్లో పుట్టిన వారికి పేదల కష్టాలు తెలువడం లేదన్నారు. పింఛన్ మీద బతికే వారంటే ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పింఛన్ దారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు