నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని రంగాపురం, గూటుపల్లె, హెచ్.కొట్టాల, ఆర్. కొత్తపల్లె, రహిమాన్పురం గ్రామాల్లో ఈ ఏడాది ఉల్లి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ధరలు పడిపోవడంతో ప్రభుత్వం మద్దతు ధరగా ₹1200 నిర్ణయించినా, రంగాపురంలో దళారులు కేవలం ₹1100కే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోయారు. అధికారులు తక్షణమే దళారుల జోక్యం లేకుండా చూడాలని కోరుతున్నారు.