ప్రకాశం జిల్లా కంభం రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు మార్కాపురం మండలం తరిమడుగు గ్రామానికి చెందిన గుమ్మా సుబ్బారావుగా గుర్తించారు. సుబ్బారావు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా విచారణలో గుర్తించామని మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో అతని ద్విచక్ర వాహనాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు.