దేశానికి గర్వకారణమైన రెండు యుద్ధనౌకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజనాధ్ సింగ్ గారు విశాఖ విచ్చేసిన సందర్భంగా రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ గారు ఐఎన్ఎస్ డేగ వద్ద పుష్పగుచ్ఛం అందజేసీ ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకల జాతికి అంకితం కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మాత్యులు మరియు నేవీ ఉన్నత అధికారులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా యుద్ధ నౌకలను ప్రత్యక్షంగా పరిశీలించి నౌకాదళ సిబ్బందితో ముచ్చటించి పలు అంశాలను స్వయంగా తెలుసుకున్నారు.