పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిపల్లి చెక్పోస్ట్ వద్ద, శుక్రవారం పెందుర్తి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చే వాహనాలను పరిశీలించగా, కొత్తవలస వైపు నుండి రెండు మోటారు సైకిళ్లపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసుల తనిఖీలను గమనించి పారిపోవడానికి ప్రయత్నించారు.ఎస్సై సిబ్బంది సమయోచితంగా స్పందించి వారిని పట్టుకుని విచారించగా, వారి వద్ద సుమారు రూ. 50,000/- విలువైన 2 కేజీల గంజాయి లిక్విడ్ ఆయిల్ (హాష్ ఆయిల్), రెండు మోటారు సైకిళ్లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు