2023 జూలైలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో రాజంపేట కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో సిమెంట్ ట్యాంకర్ నడిపి ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఆరుగురి ప్రాణాలు తీసిన తమిళనాడుకు చెందిన డ్రైవర్ మహదేవుకు రాజంపేట 3వ అదనపు జడ్జి ఎస్. ప్రవీణ్‌కుమార్ నాలుగు సంవత్సరాలు ఆరు నెలల జైలు శిక్ష విధించారు.ఈ ప్రమాదంలో 29 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కేసు దర్యాప్తు ఓబులవారిపల్లి ఎస్ఐ బి.శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సాగి, అనంతరం డీఎస్పీ వీఎన్‌కే. చైతన్య ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 56 మంది సాక్షులను విచారించిన అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.