వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను నారాయణఖేడ్ పట్టణ మరియు మండలంలోని గ్రామాల మండపాల నిర్వాహకులు జాగ్రత్తగా నిర్వహించాలని నారాయణఖేడ్ ఎస్ఐ పీవీ చరణ్ రెడ్డి బుధవారం సూచించారు. ఆయన నారాయణఖేడ్లో మాట్లాడుతూ మండపాల వద్ద నిర్వాహకులు ఎల్లప్పుడూ ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. మండపాలు వెలిగించే దీపాల వల్ల ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. మండపాల వద్ద డిజె సౌండ్ లో పెట్టి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని తెలిపారు. శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో పండగ జరుపుకోవాలని సూచించారు.