వాంకిడి మండలంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవకతవకలపై జిల్లా అధికారులు విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ BJYM రాష్ట్ర అధికార ప్రతినిధి సుచిత్ అమరణ నిరహార దీక్షకు దిగారు. మంగళవారం దీక్ష 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వాంకిడి మండలంలో ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. దీంతో అమరణ నిరహార దీక్షకు దిగాల్సి వచ్చిందన్నారు.