కాణిపాకంలో స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల లో భాగంగా గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శ్రీవారి పట్టు వస్త్రాలను టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు కుటుంబ సమేతంగా వినాయక స్వామికి సమర్పించారు. ఆలయ మర్యాదలతో మేళతాళ ధ్వనుల నడుమ వారికి ఘన స్వాగతం లభించింది. అనంతరం స్వామివారి దర్శన ఏర్పాట్లు చేయగా, ఆశీర్వద మండపంలో వేదపండితులచే ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ ఈఓ పెంచల కిషోర్ స్వామివారి తీర్థప్రసాదాలు, దివ్య చిత్రపటాన్ని బి.ఆర్. నాయుడు కుటుంబానికి అందజేశారు.