ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగిస్తూ జిల్లాస్థాయి మారధాన్ కార్యక్రమం గురువారం ఉదయం కాకినాడలో నిర్వహించారు. స్థానిక వివేకానంద పార్కు వద్ద ప్రారంభమైన రాలిని క్షయ, కుష్టి వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ప్రభాకర్ జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో 17 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు గల యువతీ, యువకులు పాల్గొని రెడ్ రన్ పేరిట ఐదు కిలోమీటర్లు పరుగు తీశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ ఉద్యోగులు రెడ్డి, రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.