ట్రాన్స్ జెండర్ సమాజానికి తగిన గుర్తింపు కల్పించాలని, ప్రభుత్వం తక్షణమే రేషన్ కార్డులు మంజూరు చేయాలని కర్నూలు ట్రాన్స్ జెండర్ సంఘం డిమాండ్ చేసింది.సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ నాయకురాలు సింధు మాట్లాడుతూ – “మేము కూడా సమాజంలో భాగమే. కానీ ఇప్పటికీ ప్రభుత్వం మాకు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చాలా మంది ట్రాన్స్ జెండర్లు రోజువారీ జీవనోపాధి కోసం తల్లడిల్లుతున్నారు. మాకు రేషన్ కార్డులు ఉంటే కనీసం ప్రభుత్వ పథకాల ద్వారా బియ్యం, నిత్యావసరాలు దొరుకుతాయి. అదేవిధంగా స్థిరమైన