మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండలం వెంకట్రావుపేట ఆయా గ్రామాల్లో వరద ఉధృతికి దెబ్బతిన్న రోడ్డు పంట పొలాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాల వల్ల ప్రకృతి విపత్తుల నేపథ్యంతో రోడ్లు,కల్వర్టులు కోతకు గురవగా రవాణా స్తంభించిపోయింది అని తెలిపారు.యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి రవాణా పునరుద్దించే పనిలో ఉన్నామని శాశ్వత మరమ్మత్తులు పంట నష్టాన్ని కూడా అంచన వేస్తున్నామని నివేదికలు ప్రభుత్వానికి స్పందించడం జరుగుతుంది అని పేర్కొన్నారు.