చిత్తూరు నగరంలోని కట్టమంచి లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో నిర్వాహకులు జోసఫ్ రాజు తో కలిసి నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి ఎం.ఎస్ భారతి చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని నిరాశ్రయుల వసతి గృహానికి సంబంధించి ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని రకాల ఫండ్స్ ను పొందేలా కలెక్టర్ తో మాట్లాడుతానని తెలియజేశారు. అనంతరం నిరాశ్రయులం మధ్య క్రిస్మస్ కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.సపోర్ట్ సంస్థ అధ్యక్షులు నిరాశ్రయుల వసతి గృహం నిర్వాహకులు జోసెఫ్ రాజు సిబ్బంది పాల్గొన్నారు